Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Food Adulteration | కల్తీ మాఫియాకు సీపీ సజ్జనార్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Food Adulteration | కల్తీ మాఫియాకు సీపీ సజ్జనార్​ వార్నింగ్​

హైదరాబాద్తెలంగాణ

Food Adulteration | కల్తీ మాఫియాకు సీపీ సజ్జనార్​ వార్నింగ్​

కల్తీ మాఫియాపై కఠిన చర్యలు చేపట్టాలని సీపీ సజ్జనార్​ అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 8:35 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Food Adulteration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Food Adulteration | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో భారీ ఎత్తున కల్తీ ఆహార పదర్థాలు లభ్యం అయ్యాయి. తాజాగా నగర కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar)​ కల్తీమాఫియాకు వార్నింగ్​ ఇచ్చారు.

Contents
  • Food Adulteration | 117 కేసులు నమోదు
    • Food Adulteration | ఉక్కుపాదం మోపాలి

ప్రజల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సజ్జనార్​ తెలిపారు. కల్తీ నివారణ కోసం బేగం బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలను తెలుసుకున్నారు.

Food Adulteration | 117 కేసులు నమోదు

ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు హెచ్-ఫాస్ట్ (H- Fast) బృందాలు నగరవ్యాప్తంగా 117 కేసులు నమోదు చేసి, సుమారు 129.34 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడంపై సీపీ అభినందించారు. ఆహార కల్తీ సమాజానికి పట్టిన చీడ పురుగన్నారు. హైదరాబాద్‌ను కల్తీ రహితంగా మార్చే ప్రక్రియను ఒక పవిత్రమైన మహా యజ్ఞంలా భావించి, సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

Food Adulteration | ఉక్కుపాదం మోపాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల చట్టప్రకారం  కఠినంగా వ్యవహరించాలని సీపీ ఆదేశించారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 108 మంది పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా సీపీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎవరూ కూడా అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని సైతం హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్

Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
Telangana Sports University | అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్​ యూనివర్సిటీ : సీఎం రేవంత్​రెడ్డి
Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
TAGGED:fake food mafiafood adulterationFood safety IndiaHyderabad Policepolice crackdownsajjanar warning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Singur dam safety Singur dam safety | సింగూర్​ డ్యామ్​ సేఫ్టీ పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి రాజనర్సింహ
Next Article KCR Public Meeting KCR Public Meeting | ఏడాది తర్వాత బహిరంగ సభకు కేసీఆర్​.. భారీ ఏర్పాట్లు చేస్తున్న నాయకులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?