Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

నగరంలో ఎక్కడబడితే అక్కడ భూములు కబ్జాలు చేస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. ఓ పక్క సీఎం రేవంత్​రెడ్డి, మరోపక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కబ్జాలు చేస్తున్నారన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 3:20 సా.
Srinivas Kolluri
23 గంటలు ago
Share
KTR comments

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR comments | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డిపై ఆరోపణలు చేశారు. హైదరాబాద్​ నగరంలో సంతోషంగా ఉన్నది దోమలు, దొంగలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. నగరంలో ఎక్కడబడితే అక్కడ భూములు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ పక్క సీఎం రేవంత్​రెడ్డి, మరోపక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Contents
  • KTR comments | ఉప్పల్​ ఫ్లై ఓవర్​ పూర్తి చేయాలి
    • KTR comments | మళ్లీ గెలుస్తాం
      • KTR comments | పోరాటం చేస్తాం

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్​ పాల్గొన్నారు. హైదరాబాద్​ నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ పేరును దోమలబాదు, దోమలగూడ అని పెట్టమని గతంలో అసెంబ్లీలో చెప్పానని గుర్తు చేశారు. కేసీఆర్​ను బద్నాం చేసి హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి చూస్తున్నారన్నారు. కాంగ్రెస్​ నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు.

KTR comments | ఉప్పల్​ ఫ్లై ఓవర్​ పూర్తి చేయాలి

ఉప్పల్ ఫ్లై ఓవర్ (Uppal Fly over) భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం దీని పనులు చేపట్టి 8 ఏళ్లు అయిందని, ఎక్కడ పని అక్కడే ఉందన్నారు. ఫ్లై ఓవర్​ను బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తామంటే మేమే కడతాం అన్నారని చెప్పారు.

KTR comments | మళ్లీ గెలుస్తాం

మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లాలో మూడు క్లిన్ స్వీప్ చేశామని కేటీఆర్​ అన్నారు. మళ్లీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్​ఎస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్​గిరి కార్పొరేషన్​ ఎన్నికలు సెప్టెంబర్, అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్​ను గెలిపిస్తే బుల్డోజర్ వస్తుందని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

KTR comments | పోరాటం చేస్తాం

డీలిమిటేషన్ (Delimitation) పేరుతో బీజేపీ మరో కొత్త కుట్రకు తెరలేపుతోందని కేటీఆర్​ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఆధ్యర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్​ఎస్​ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్​ అమలు చేశామని చెప్పారు.

దీనిని కూడా చదవండి : Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త

Bhu Bharati portal | ఒకే వేదికపై రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు : మంత్రి పొంగులేటి
Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​కు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం కుట్రలో భాగమే : కల్వకుంట్ల కవిత
Enugu Narasimha Reddy | కళానిధి.. ఏనుగు నరసింహారెడ్డి
CBG Project | తెలంగాణ బయో – ఇంధన రంగంలో నవశకం.. సిద్దిపేటలో రూ. 700 కోట్లతో భారీ CBG ప్రాజెక్టు ప్రారంభం
Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
TAGGED:BRSCongress TelanganaHyderabad PoliticsKTRLand EncroachmentMunicipal ElectionsRevanth ReddyTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Modi Karnataka Visit Modi Karnataka Visit | అమ్మ పేరుతో మొక్కలు నాటండి : ప్రధాని మోదీ
Next Article Gut Health Issues Gut Health Issues | గట్-వెదర్ పారడాక్స్.. హైదరాబాద్‌లో వేసవి తాపంతో పెరుగుతున్న గ్యాస్ట్రిక్ సమస్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?