Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Foot Fingers Personality | వామ్మో.. అర చేతి రేఖలే కాదు.. పాదాల వేళ్లు కూడా భవిష్యత్తును నిర్ణయిస్తాయట!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Foot Fingers Personality | వామ్మో.. అర చేతి రేఖలే కాదు.. పాదాల వేళ్లు కూడా భవిష్యత్తును నిర్ణయిస్తాయట!

భక్తితాజా వార్తలులైఫ్​స్టైల్​

Foot Fingers Personality | వామ్మో.. అర చేతి రేఖలే కాదు.. పాదాల వేళ్లు కూడా భవిష్యత్తును నిర్ణయిస్తాయట!

పాదాల ఆకృతిని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది ప్రాచీన సముద్రిక శాస్త్రంలోని ఒక భాగం.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 15, 2026 6:39 సా.
Naresh chandan
3 గంటలు ago
Share
Foot Fingers Personality
Foot Fingers Personality

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Foot Fingers Personality | సాధారణంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా వారి ముఖ కవళికలు లేదా అరచేతి రేఖలను చూసి అంచనా వేస్తుంటాం. కానీ మన భవిష్యత్తు, స్వభావం కేవలం చేతుల్లోనే కాదు.. మన పాదాల వేళ్లలో కూడా నిక్షిప్తమై ఉంటుందని తెలుసా?

Contents
  • Foot Fingers Personality | వీరు వేరే లెవల్​
    • Foot Fingers Personality | నిర్ణయాత్మక పాత్ర
      •  Foot Fingers Personality | బొటనవేలు ఆకృతి – జీవిత సత్యం:

సముద్రిక శాస్త్రం ప్రకారం, మన పాదాల ఆకృతి, వేళ్ల మధ్య ఉండే దూరం మన వైవాహిక బంధం, ప్రేమ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కాలి బొటనవేలు, చూపుడు వేలు ఇచ్చే సంకేతాలు భాగస్వామితో సంబంధం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

Foot Fingers Personality | వీరు వేరే లెవల్​

వేళ్ల మధ్య దూరం లేకపోతే: కాలి బొటనవేలు, దాని పక్కనే ఉండే చూపుడు వేలు ఒకదానికొకటి ఆనుకుని, చాలా దగ్గరగా ఉంటే.. అత్యంత వివేకవంతులని అర్థం. ఇలాంటి వారు గొడవలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి కుటుంబం, బంధాల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత కోసం చిన్న చిన్న విషయాలను వదులుకోవడమే కాకుండా, త్యాగాలకు కూడా వెనుకాడరు.

వేళ్ల మధ్య ఖాళీ ఉంటే: బొటనవేలుకు, చూపుడు వేలుకు మధ్య స్పష్టమైన గ్యాప్ కనిపిస్తుంటే, ఆ వ్యక్తికి స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. వీరు ఎవరి నియంత్రణలో ఉండటానికి ఇష్టపడరు. ప్రేమ బంధంలో ఉన్నప్పటికీ, తమకంటూ కొంత వ్యక్తిగత స్వేచ్ఛ (Space) ఉండాలని కోరుకుంటారు. ఈ స్వతంత్ర భావాల వల్ల కొన్నిసార్లు భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది.

Foot Fingers Personality | నిర్ణయాత్మక పాత్ర

చూపుడు వేలు పొడవుగా ఉంటే: చాలామందికి బొటనవేలు కంటే దాని పక్కనున్న చూపుడు వేలు పొడవుగా ఉంటుంది. ఇది బలమైన నాయకత్వ లక్షణానికి (Leadership) నిదర్శనం. ఇలాంటి వారు ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో తమ మాటే నెగ్గాలని కోరుకుంటారు. బంధాల్లో కూడా నిర్ణయాత్మక పాత్ర వీరిదే అయి ఉంటుంది.

చూపుడు వేలు చిన్నదిగా ఉంటే: చూపుడు వేలు బొటనవేలు కంటే చిన్నదిగా ఉంటే, వారు చాలా శాంతమూర్తులు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ, బంధాలను చాలా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే సున్నితత్వం వీరి ప్రత్యేకత.

 Foot Fingers Personality | బొటనవేలు ఆకృతి – జీవిత సత్యం:

గుండ్రంగా, బొద్దుగా ఉంటే: వీరి జీవితం సుఖసంతోషాలతో, విలాసవంతంగా సాగుతుంది. వీరిని అదృష్టవంతులుగా పరిగణించవచ్చు.

వంగి లేదా మెత్తగా ఉంటే: జీవితంలో కొన్ని ఒడుదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, వీరు అపారమైన సహనం, పట్టుదల కలిగిన వారు. ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొని విజయం సాధిస్తారు.

ఇది కూడా చదవండి: Lungs Health Exercises | శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా.. లంగ్స్ ప్రమాదంలో ఉన్నాయేమో.. ఇలా చేయండి!

ఇది కూడా చదవండి: Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!

ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇది కూడా చదవండి: Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!

ఇది కూడా చదవండి: Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!

Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
April 06 Gold Rates | కొనుగోలుదారులకు ఊరట.. దేశవ్యాప్తంగా త‌గ్గిన‌ బంగారం, వెండి ధరలు!
ఎండకాలంలో మీ పెంపుడు కుక్కల జాగ్రత్తలు.. ‘సమ్మర్ డైట్ రీసెట్’ తప్పనిసరి
Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
TAGGED:astrology body signsFoot Fingers Personalityfuture prediction body signsindian palmistry alternativeslove life signs toespersonality traits toessamudrika shastratoe reading meaning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 17 Horoscope April 17 Horoscope | పెట్టుబడుల ద్వారా అఖండ ధనలాభం.. ఈ రాశుల వారు ‘జాక్‌పాట్’ కొట్టినట్లే!
Next Article April 17 Gold Rates April 17 Gold Rates | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?