అక్షరటుడే, వెబ్డెస్క్: Foot Fingers Personality | సాధారణంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా వారి ముఖ కవళికలు లేదా అరచేతి రేఖలను చూసి అంచనా వేస్తుంటాం. కానీ మన భవిష్యత్తు, స్వభావం కేవలం చేతుల్లోనే కాదు.. మన పాదాల వేళ్లలో కూడా నిక్షిప్తమై ఉంటుందని తెలుసా?
సముద్రిక శాస్త్రం ప్రకారం, మన పాదాల ఆకృతి, వేళ్ల మధ్య ఉండే దూరం మన వైవాహిక బంధం, ప్రేమ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కాలి బొటనవేలు, చూపుడు వేలు ఇచ్చే సంకేతాలు భాగస్వామితో సంబంధం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
Foot Fingers Personality | వీరు వేరే లెవల్
వేళ్ల మధ్య దూరం లేకపోతే: కాలి బొటనవేలు, దాని పక్కనే ఉండే చూపుడు వేలు ఒకదానికొకటి ఆనుకుని, చాలా దగ్గరగా ఉంటే.. అత్యంత వివేకవంతులని అర్థం. ఇలాంటి వారు గొడవలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి కుటుంబం, బంధాల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత కోసం చిన్న చిన్న విషయాలను వదులుకోవడమే కాకుండా, త్యాగాలకు కూడా వెనుకాడరు.
వేళ్ల మధ్య ఖాళీ ఉంటే: బొటనవేలుకు, చూపుడు వేలుకు మధ్య స్పష్టమైన గ్యాప్ కనిపిస్తుంటే, ఆ వ్యక్తికి స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. వీరు ఎవరి నియంత్రణలో ఉండటానికి ఇష్టపడరు. ప్రేమ బంధంలో ఉన్నప్పటికీ, తమకంటూ కొంత వ్యక్తిగత స్వేచ్ఛ (Space) ఉండాలని కోరుకుంటారు. ఈ స్వతంత్ర భావాల వల్ల కొన్నిసార్లు భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది.
Foot Fingers Personality | నిర్ణయాత్మక పాత్ర
చూపుడు వేలు పొడవుగా ఉంటే: చాలామందికి బొటనవేలు కంటే దాని పక్కనున్న చూపుడు వేలు పొడవుగా ఉంటుంది. ఇది బలమైన నాయకత్వ లక్షణానికి (Leadership) నిదర్శనం. ఇలాంటి వారు ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో తమ మాటే నెగ్గాలని కోరుకుంటారు. బంధాల్లో కూడా నిర్ణయాత్మక పాత్ర వీరిదే అయి ఉంటుంది.
చూపుడు వేలు చిన్నదిగా ఉంటే: చూపుడు వేలు బొటనవేలు కంటే చిన్నదిగా ఉంటే, వారు చాలా శాంతమూర్తులు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ, బంధాలను చాలా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే సున్నితత్వం వీరి ప్రత్యేకత.
Foot Fingers Personality | బొటనవేలు ఆకృతి – జీవిత సత్యం:
గుండ్రంగా, బొద్దుగా ఉంటే: వీరి జీవితం సుఖసంతోషాలతో, విలాసవంతంగా సాగుతుంది. వీరిని అదృష్టవంతులుగా పరిగణించవచ్చు.
వంగి లేదా మెత్తగా ఉంటే: జీవితంలో కొన్ని ఒడుదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, వీరు అపారమైన సహనం, పట్టుదల కలిగిన వారు. ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొని విజయం సాధిస్తారు.
ఇది కూడా చదవండి: Lungs Health Exercises | శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా.. లంగ్స్ ప్రమాదంలో ఉన్నాయేమో.. ఇలా చేయండి!
ఇది కూడా చదవండి: Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!
ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇది కూడా చదవండి: Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!
ఇది కూడా చదవండి: Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
