అక్షరటుడే, వెబ్డెస్క్: Mantralayam Road Accident | కర్నూల్ Kurnool జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం మరియు లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసరంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాల తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
Mantralayam Road Accident | తిరుగు ప్రయాణంలో మృతి..
మృతుల్లో అమృత, తేజస్వని, ధన్య, దీపక్, దీక్షిత, ప్రతాప్, కుమార్‌లను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు జిల్లా కనకాయహల్లి గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు.
ఇప్పటికే బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం Accident చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Mantralayam Road Accident | అజాగ్రత్త వల్లనే
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం Over Speed లేదా రహదారి పరిస్థితులు కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇటీవల రోడ్డు ప్రమాదాలకి చాలా మంది మృత్యువాత పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎన్నిహెచ్చరికలు జారీ చేసిన కూడా కొందరు అజాగ్రత్త వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Child Choking First Aid | పిల్లల గొంతులో ఏదైనా వస్తువు ఇరుక్కుపోయిందా.. ప్రమాదం నుంచి గట్టెక్కించే మార్గం ఇదే!
