అక్షరటుడే, వెబ్‌డెస్క్: Running Car Fire | రన్నింగ్ కారులో మంటలు చేలరేగి, పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన శంషాబాద్ (Shamshabad) సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
శంషాబాద్‌లోని రద్దీగా ఉండే హైదరాబాద్ విమానాశ్రయ రోడ్డు (Hyderabad Airport Road)లోని సిద్ధాంతంతి సమీపంలో ఒక మహీంద్రా కారుకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తొండపల్లికి చెందిన ఒక మెకానిక్‌కు చెందిన ఈ వాహనానికి ఇంజన్ మరమ్మతులు జరుగుతున్నాయని సమాచారం. దానిని ట్రయల్ రన్ కోసం తీసుకువెళుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Running Car Fire | భారీగా ట్రాఫిక్ జామ్..
శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారు సిద్ధాంతి సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. కారును పక్కకు ఆపి బయటకు దూకేశాడు. అనంతరం క్షణాల్లో కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇది కూడా చదవండి..: George Reddy nivali | జార్జి రెడ్డి ఆశయ సాధనే విద్యార్థి లోకానికి మార్గదర్శకం – ఎస్.ఎల్. పద్మ
