అక్షరటుడే, వెబ్డెస్క్: Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఈ మేరకు గురువారం బిల్లుపై వ్యాఖ్యానిస్తూ వీడియో విడుదల చేశారు.
Women Bill Delimitation | మహిళల భుజాలపై తుపాకీ పెట్టి..
మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్లో 3.13 శాతంగా ఉన్న తెలంగాణ ప్రాతినిధ్యం డీలిమిటేషన్ (Delimitation) తర్వాత కూడా అంతే ఉండాలని పేర్కొన్నారు. లేదంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మహిళ బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాల్సిందేనన్నారు. మహిళ బిల్లు (Women’s Bill)ను ఇప్పటికే పాస్ చేశారని.. ఇప్పుడు డీలిమిటేషన్ను మహిళ బిల్లుకు లింక్ చేస్తూ కేంద్రం కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు.
Women Bill Delimitation | రెండు వేర్వేరు అంశాలు..
మహిళ బిల్లు, డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని కవిత అన్నారు. నియోజకవర్గాలను బ్లాంకెట్గా 50 శాతం పెంచుతామని కేంద్రం చెబుతోందని.. చూడటానికి ఇది కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరగుతుందని ఆమె పేర్కొన్నారు. బీహార్ లాంటి రాష్ట్రంలో పెరిగిన సీట్లతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ సీట్లు ఉంటాయని ఆమె వివరించారు.
Women Bill Delimitation | తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది.
బిల్లులో తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని.. డీలిమిటేషన్ను ఏ ప్రాతిపదికన తెచ్చినా సరే తెలంగాణకు 3.13 శాతం వాటా తగ్గొద్దని కోరారు. లేదంటే తెలంగాణ (Telangana) ప్రజలు మరో తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని.. ఏ ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా ఇవ్వటం లేదని వివరించారు.ఇంకా మన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. మహిళ బిల్లుకు డీలిమిటేషన్ను లింక్ చేయటం సరికాదన్నారు. మహిళ బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి..: Running Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
