అక్షరటుడే, వెబ్‌డెస్క్ : VinFast VF MPV 7 | వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ సరికొత్త ప్రీమియం విద్యుత్ మల్టీ పర్పస్ వెహికల్ ‘వీఎఫ్ ఎంపీవీ 7’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రధానంగా ఫ్లీట్(కమర్షియల్) ఆపరేటర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.
దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 517 కిలోమీటర్లు(ఏఆర్ఏఐ సర్టిఫైడ్) ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఏడు సీట్లు కలిగిన ఈ కారు ప్రారంభ ధర (ఎక్స్ షోరూం)ను రూ.24.49 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం దేశీయ విపణిలో వీఎఫ్6, వీఎఫ్7 విద్యుత్ కార్లను కంపెనీ విక్రయిస్తోంది. ప్రస్తుతం విడుదల చేసినది మూడో ఎంపీవీ. దీని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
డిజైన్ : ‘వీఎఫ్ ఎంపీవీ 7’ మోడల్ అధునాతన డిజైన్ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోంది. ఇది 4,740 మిమీ పొడవు, 1,872 మిమీ వెడల్పు, 1,734 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. 1,240 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం ఉంది.
ఎక్స్‌టీరియర్ : ముందు భాగంలో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ ‘ఏ’ లోగోతో కూడిన ఎలఈడీ డీఆరఎల్‌లున్నాయి. నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేక లుక్‌ని ఇస్తాయి. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనక వైపు కారు వెడల్పు పొడవునా ఉండే టెయిల్ లైట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
VinFast VF MPV 7 | ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ లోపల 10.1 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. యూఎస్‌బీ -ఏ, యూఎస్‌బీ -సీ చార్జింగ్ పోర్ట్‌లు ఇచ్చారు. ఆల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీపీఎంఎస్), ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయి.
VinFast VF MPV 7 | పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్..
60.1 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
201 హెచ్‌పీ శక్తిని, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. ఇది మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లతో లభిస్తుంది.
VinFast VF MPV 7 | బుకింగ్స్ ప్రారంభం..
‘వీఎఫ్ ఎంపీవీ 7’ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగలవారు రూ. 21 వేల టోకెన్ మొత్తంతో కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ద్వితీయార్థంలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది చివరలో ‘లిమో గ్రీన్’ (‘Limo Green’)పేరుతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కమర్షియల్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ
