అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Surge | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా -ఇరాన్ మరోసారి శాంతి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న సంకేతాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లోనూ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ (Nifty) భారీగా లాభపడ్డాయి.
Stock Market Surge | భారీ లాభాలతో..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,134 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో స్వల్పంగా 132 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 421 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 321 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై 18 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 135 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,263 పాయింట్ల లాభంతో 78,111 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో 24,231 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,585 కంపెనీలు లాభపడగా 802 స్టాక్స్ నష్టపోయాయి. 126 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 35 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Stock Market Surge | అన్ని ఇండెక్స్‌లూ గ్రీన్‌లోనే..
అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో పవర్ ఇండెక్స్ 2.87 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.84 శాతం, ఐటీ 2.84 శాతం, రియాలిటీ 2.56 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.54 శాతం, యుటిలిటీ 2.52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.16 శాతం పెరిగాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్స్ లాభపడగా.. 2 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఇండిగో 4.63 శాతం, ఎటర్నల్ 4.36 శాతం, పవర్‌గ్రిడ్ 4.11 శాతం, టెక్ మహీంద్రా 3.33 శాతం, టీసీఎస్ 3.31 శాతం లాభపడ్డాయి.
Losers : ఎయిర్ టెల్ 0.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.20 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్
