అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Unauthorized Idol Installation | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయడం నిషేధమని, అలాగే పెద్ద శబ్ధంతో డీజేలు పెట్టడాన్ని అనుమతించేది లేదని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Unauthorized Idol Installation | పెద్ద శబ్దాలతో రోగులకు, చిన్నారులకు ఇబ్బందులు..
ఎక్కువశబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని సీపీ అన్నారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేఈలను నిషేధించినట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ప్రతిష్టాపనకు తప్పనిసరిగా కలెక్టర్‌తో కూడిన కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సీపీ తెలియజేశారు.
Unauthorized Idol Installation | ఊరేగింపులు, సభల నిర్వహణ..
ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ (Assistant Police Commissioner) అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు.
Unauthorized Idol Installation | సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు..
మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ప్రతిఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలన్నారు. డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదల్చితే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
Unauthorized Idol Installation | నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండి అప్రమత్తం..
జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పలువురిని మోసం చేస్తున్నారన్నారు. పాస్‌పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలామంది గల్ఫ్ ఏజెంట్లు అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని సీపీ సూచించారు. జిల్లాలో ‘ఎ’ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు చిన్నారులను అనుమతించవద్దని పేర్కొన్నారు.
Unauthorized Idol Installation | బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం..
బహిరంగ ప్రదేశాల్లో మద్య సేవించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. మహిళలు, పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి..: Turmeric price protest | వ్యవసాయ మార్కెట్‌ను ముట్టడించిన రైతులు..
