Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Farmers MSP Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: మార్కెట్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Farmers MSP Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: మార్కెట్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌

నిజామాబాద్

Farmers MSP Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: మార్కెట్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌

రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గడ్డం నర్సారెడ్డి సూచించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 4:44 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Farmers MSP Procurement

అక్షరటుడే, భీమ్​గల్: Farmers MSP Procurement | రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గడ్డం నర్సారెడ్డి సూచించారు. పచ్చలనడ్కుడ (Pachchalanadkuda) సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Contents
  • Farmers MSP Procurement | 50 కేంద్రాల ఏర్పాటు..
    • Farmers MSP Procurement | మద్దతు ధరతోనే మేలు..

Farmers MSP Procurement | 50 కేంద్రాల ఏర్పాటు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కంటే భిన్నంగా, రైతుల సౌకర్యార్థం ఈసారి అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘వేల్పూర్ మార్కెట్ కమిటీ (Velpur Market Committee) పరిధిలో మొత్తం 50 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. సహకార సంఘాలతో పాటు మహిళా సంఘాల ద్వారా కూడా సేకరణ జరుపుతున్నామని పేర్కొన్నారు. రైతులు అడగకముందే మక్కల (మొక్కజొన్న) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన కొనియాడారు.

Farmers MSP Procurement | మద్దతు ధరతోనే మేలు..

వ్యాపారస్థుల చేతుల్లో రైతులు (Farmers) మోసపోకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సారెడ్డి స్పష్టం చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ రమేష్, సెక్రెటరీ మహబూబ్, సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ రఘు, ఏఈవో స్నేహశ్రీ, జీపీవో కిషన్, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, ఓబీసీ సెక్రెటరీ లింగేశ్వర్, మాజీ ఛైర్మన్ లింబారెడ్డి, నాయకులు వినోద్, హలీం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య

belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​షాపు టెండర్.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
Hindu Sammelan | హిందూ ధర్మాన్ని ఆచరించడమే అన్ని సమస్యలకు పరిష్కారం: అయాచితుల లక్ష్మణరావు
Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Fire Safety Week | కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు: జిల్లా ఫైర్ స్టేషన్​ అధికారి సుధాకర్
Road safety awareness | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు : మంత్రి పొన్నం ప్రభాకర్​
TAGGED:crop purchase centersfarmer awarenessFarmersFarmers MSP ProcurementFarmers newsmarket committeeMSP procurementPachchalanadkudarural economyTelangana FarmersVelpur Market Committee
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Surge Stock Market Surge | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు
Next Article Illegal Sand Transport Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?