అక్షరటుడే, భీమ్‌గల్ : Illegal Sand Transport | మండల పరిధిలో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాపై సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు.
Illegal Sand Transport | భారీ వాహనాలు సీజ్..
వేల్పూర్ పోలీస్ స్టేషన్ (Velpur Police Station) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు 14 టైర్ల భారీ వాహనాలను (లారీలను) పోలీసులు పట్టుకున్నారు. వాహనాలతో పాటు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Illegal Sand Transport | వేల్పూర్ పోలీసులకు అప్పగింత..
పట్టుబడిన వాహనాలను, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వేల్పూర్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించినట్లు సీసీఎస్ అధికారులు (CCS Officials) తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య
