అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Road safety awareness | రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘అరైవ్ అలైవ్’(Arrive Alive) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
Road safety awareness | మంత్రికి ఘనస్వాగతం..
‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలీకాప్టర్ ద్వారా మంత్రి మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(Police Commissioner Sai Chaitanya), అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు తదితరలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి పోలీసు బందోబస్తు మధ్య ఆయన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
Road safety awareness | నగరంలో బైక్ ర్యాలీ..
ఈ ర్యాలీ కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా అధికారులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు.
Road safety awareness | నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
మంత్రి మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. దీంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నరు. ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిని గుర్తిస్తూ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అరైవ్ అలైవ్ పేరుతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోందని వెల్లడించారు.
అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్పందించి ఆస్పత్రికి తరలించాలని, అలా కృషి చేసిన వారిని రహ్ వీర్ కింద రూ.25 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.

ఇది కూడా చదవండి: Vivo T5 Pro | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వీవో నుంచి మరో ఫోన్
