Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vivo T5 Pro | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వీవో నుంచి మరో ఫోన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Vivo T5 Pro | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వీవో నుంచి మరో ఫోన్

బిజినెస్​

Vivo T5 Pro | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వీవో నుంచి మరో ఫోన్

వివో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 5:38 సా.
Srinivas Kolluri
20 గంటలు ago
Share
Vivo T5 Pro

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vivo T5 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ (Smartphone)ల తయారీ కంపెనీ అయిన వీవో మిడ్ రేంజ్‌లో మరో మోడల్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. టి5 ప్రో పేరుతో బుధవారం మధ్యాహ్నం భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Contents
  • Vivo T5 Pro | డిస్‌ప్లే..
    • Vivo T5 Pro | సాఫ్ట్‌వేర్..
      • Vivo T5 Pro | కెమెరా సెటప్..

ఇది టి5 సిరీస్‌లో వచ్చిన రెండో ఫోన్. భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా సిస్టమ్ , శక్తిమంతమైన ప్రాసెసర్‌తో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకువచ్చిన ఈ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

Vivo T5 Pro | డిస్‌ప్లే..

6.83 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10 ప్లస్, 1260 2800 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
స్లీప్ కంఫర్ట్ మోడ్, యాంటీ మోషన్ సిక్నెస్ మోడ్ కూడా ఉన్నాయి. ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్, లో ఫ్లికర్ సర్టిఫికేషన్లు ఉన్నాయి.
ఈ ఫోన్ మందం 8.25 మిల్లీమీటర్లు. బరువు సుమారు 213 గ్రాములు.

Vivo T5 Pro | సాఫ్ట్‌వేర్..

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. అంటుటు బెంచ్‌మార్క్‌లో 11,80,000 పాయింట్లు సాధించింది.

Vivo T5 Pro | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ బొకే కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. రెండు కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ సామర్థ్యం:
9020 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్:
కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది.
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999.
8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999.
12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999.

కార్డ్ ఆఫర్లు:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్
IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..
TAGGED:5G smartphones Indiamid range smartphones 2026smartphone launch newsSnapdragon 7s Gen 4 phonevivo india offersvivo mobile launch indiaVivo T5 Provivo t5 pro 5gvivo t5 pro specs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Yellareddy Student Death Protest Yellareddy Student Death Protest | ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్​..
Next Article Road safety awareness | Road safety awareness | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు : మంత్రి పొన్నం ప్రభాకర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?