అక్షరటుడే, భీమ్గల్: Telangana Employees Protest | రేపు జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో (black badges) నిరసన తెలపనున్నారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్న వేళల్లో శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఇలా త్రిపాఠికి వారు వినతిపత్రం అందజేశారు.
Telangana Employees Protest | నగరంలోని టీఎన్జీవోస్ కాన్ఫరెన్స్ హాల్లో..
అంతకుముందు నగరంలోని టీఎన్జీవో కాన్ఫరెన్స్ హాల్ (TNGO Conference Hall)లో ఏర్పాటు చేసిన అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశంలో నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ (IDOC) కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు (District Collector) వినతిపత్రం అందజేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీజీఈజేఏసీ (TGEJAC) భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మేందర్, శ్రీకాంత్, జమీలుల్లా, ఓమాజీ, నేరెళ్ల శ్రీనివాస్, బీరేందర్ సింగ్, నేతికుంట శేఖర్, జాకీర్ హుస్సేన్, సుధాకర్, జాఫర్ హుస్సేన్, శివకుమార్, అశ్విన్, మారుతి, గీతా రెడ్డి, సునీల్ కుమార్, స్వామి, విజయలక్ష్మి, శ్రీవేణి, భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Government Schemes | అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
