Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: West Asia War Impact | పశ్చిమాసియాలో యుద్ధంతో నష్టమే.. ఐఎంఎఫ్ ఏమంటోందంటే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - West Asia War Impact | పశ్చిమాసియాలో యుద్ధంతో నష్టమే.. ఐఎంఎఫ్ ఏమంటోందంటే?

అంతర్జాతీయం

West Asia War Impact | పశ్చిమాసియాలో యుద్ధంతో నష్టమే.. ఐఎంఎఫ్ ఏమంటోందంటే?

పశ్చిమాసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్‌తో చాలా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధంతో ఏ దేశాలకు లాభం, వేటికి నష్టం అనే దానిపై ఐఎంఎఫ్ అంచనాల్ని వెలువరించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 4:43 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
West Asia War Impact

అక్షరటుడే, వెబ్​డెస్క్: West Asia War Impact | ఇరాన్- అమెరికా మధ్య ప్రారంభమైన యుద్ధం ఎనిమిదో వారంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులో ఉన్నా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. మొదటి దశ చర్చలు విఫలమవగా.. రెండో దశ చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు.

Contents
  • West Asia War Impact | నెమ్మదించనున్న ఆర్థిక వృద్ధి..
    • West Asia War Impact | ఏ దేశాలకు లాభమంటే..
      • West Asia War Impact | ఏ దేశాలకు నష్టమంటే..

మరోవైపు ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరగడంతో చాలా దేశాలలో ధరలను పెంచేశారు. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశాలున్నాయి. గ్యాస్‌కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

West Asia War Impact | నెమ్మదించనున్న ఆర్థిక వృద్ధి..

ప్రస్తుత సంక్షోభం ఇలాగే కొనసాగితే ప్రపంచ వృద్ధి 2 శాతం కంటే తక్కువకు పడిపోవచ్చని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ రిపోర్టులో పేర్కొంది. ఇదే జరిగితే ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. 1980 తర్వాత నాలుగుసార్లు ఇలా జరిగిందని తెలిపింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతాయని, ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడింది. కొన్ని దేశాల్లో ఆహార భద్రత సమస్యలు కూడా తలెత్తవచ్చని హెచ్చరిస్తోంది.

West Asia War Impact | ఏ దేశాలకు లాభమంటే..

పశ్చిమాసియాలోని అనిశ్చిత పరిస్థితులు ఏయే దేశాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయన్న అంశంపై ఐఎంఎఫ్ (IMF) అంచనాల్ని వెలువరించింది. సౌదీ అరేబియా, చైనా, రష్యా వంటి దేశాలు హార్ముజ్ జలసంధిపై పెద్దగా ఆధారపడవు. దీంతోపాటు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలను కలిగి ఉన్నాయి. దీంతో వీటిపై యుద్ధ ప్రభావం పెద్దగా ఉండదని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. చమురు ధరల పెరుగుదల వల్ల రష్యా లబ్ధి పొందుతుందని, వచ్చే ఏడాది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 1.1 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తోంది.

West Asia War Impact | ఏ దేశాలకు నష్టమంటే..

హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో కొన్ని దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. జాంబియాలో అత్యధికంగా 30 శాతానికిపైగా ఆహార ధరలు పెరగవచ్చని, శ్రీలంకలో 15 శాతానికిపైగా పెరుగుతాయని, తైవాన్‌లో 12 శాతం, పాకిస్థాన్‌లో 11 శాతానికిపైగా ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. భారత్‌లోనూ 10.7 శాతం మేర ధరలు పెరగవచ్చని అభిప్రాయపడుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో ఇంధన సంక్షోభం కారణంగా బ్రిటన్ అత్యధికంగా ప్రభావితం అవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2026లో ఖతార్, ఇరాక్ ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణిస్తుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Israel Lebanon Talks | ఇజ్రాయెల్​, లెబనాన్​ మధ్య నేడు చర్చలు : ట్రంప్​

 Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Glowing Plants China | ఈ మొక్కలు వెలుగుతాయి.. చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
Donald Trump Health | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. ఆరోగ్యంపై మొద‌లైన కొత్త చ‌ర్చ‌
Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:Crude Oilcrude oil prices surgeeconomic slowdown 2026geopolitics newsglobal economy crisisIMFimf global outlookinflation impact worldIran US conflictStrait of HormuzWest Asia War Impact
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Loss Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు
Next Article Road Safety Awareness Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?