అక్షరటుడే, వెబ్‌డెస్క్: Osmania Hospital Suicide | హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి Osmania General Hospital ఆవరణలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీజీ హాస్టల్‌లో నివసిస్తున్న డాక్టర్ రత్రావత్ సురేష్ నాయక్ (26) అనే మొదటి సంవత్సరం పీజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సురేష్, జనరల్ సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్నాడు. ఆత్మహత్యకు ముందు తన తల్లి నాగమణికి ఫోన్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు కావాలనే ఎక్కువ సమయవ డ్యూటీలు వేస్తున్నారని, సీనియర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు సమాచారం.
Osmania Hospital Suicide | కారణాలు ఏంటి?
కొద్దిసేపటికి అతను అపస్మారక స్థితిలో పడిపోవడం గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వందలాది మంది జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. సురేష్ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సుమారు నాలుగు గంటల పాటు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ Damodar Raja Narasimha స్పందించాలని నినాదాలు చేశారు.
Osmania Hospital Suicide |
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇక సురేష్ గత కొన్ని రోజులుగా డ్యూటీ సమయాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.
మరోవైపు, అతను డిప్రెషన్‌తో మందులు వాడుతున్నాడనే సమాచారం కూడా వినిపిస్తోంది. అయితే పోలీసులు వేధింపుల కోణంలో కూడా కేసును విచారిస్తున్నారు. హెచ్ఆర్‌డీఏ Telangana Healthcare Reforms Doctors Association (HRDA) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
వైద్య వృత్తిలో ముఖ్యంగా పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పనిభారం, మానసిక ఒత్తిడి, వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై అఫ్జల్‌గంజ్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేష్ మరణం వైద్య రంగంలో ఉన్న ఒత్తిడి, వ్యవస్థలోని లోపాలపై మళ్లీ చర్చకు దారి తీసింది.
ఇది కూడా చదవండి: Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
