అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 17 Pre Market Analysis | పశ్చిమాసియా(West asia)లో యుద్ధ విరమణ చర్చలపై ఆశలు చిగురిస్తున్నప్పటికీ అనిశ్చితి క=నసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసినా శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉండడంతో మన మార్కెట్ ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
April 17 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.36 శాతం, ఎస్ అండ్ పీ 0.26 శాతం లాభపడగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.12 శాతం లాభంతో ఉంది.
April 17 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.36 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.29 శాతం లాభపడగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.14 శాతం నష్టపోయింది.
April 17 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.86 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.80 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.53 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.31 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.25 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.23 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంది. దీంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 382 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- చాలా కాలం తర్వాత డీఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,427 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.12 నుంచి 0.98 కు తగ్గింది.
- విక్స్ 3.12 శాతం తగ్గి 18.08 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.26 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.32 వద్ద ఉన్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98.35 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలపడి 93.20 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Vaisakha Amavasya | అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారా.. వైశాఖ అమావాస్య నాడు ఈ చిన్న పని చేస్తే రుణ విముక్తి ఖాయం!
ఇది కూడా చదవండి: Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ఇది కూడా చదవండి: Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!
ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇది కూడా చదవండి: Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!
ఇది కూడా చదవండి: Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
