Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Osmania Hospital Suicide | ఉస్మానియా ఆసుపత్రిలో విషాదం.. పీజీ విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కార‌ణమా?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Osmania Hospital Suicide | ఉస్మానియా ఆసుపత్రిలో విషాదం.. పీజీ విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కార‌ణమా?

హైదరాబాద్తాజా వార్తలుమహబూబ్‌నగర్

Osmania Hospital Suicide | ఉస్మానియా ఆసుపత్రిలో విషాదం.. పీజీ విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కార‌ణమా?

హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో పీజీ చదువుతున్న యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు, అధిక డ్యూటీలే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 17, 2026 8:18 ఉద.
Naresh chandan
5 గంటలు ago
Share
Osmania Hospital Suicide
Osmania Hospital Suicide

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Osmania Hospital Suicide | హైదరాబాద్‌లోని ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రి Osmania General Hospital ఆవరణలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీజీ హాస్టల్‌లో నివసిస్తున్న డాక్టర్ రత్రావత్ సురేష్ నాయక్ (26) అనే మొదటి సంవత్సరం పీజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Contents
  • Osmania Hospital Suicide | కార‌ణాలు ఏంటి?
    • Osmania Hospital Suicide |

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సురేష్, జనరల్ సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్నాడు. ఆత్మహత్యకు ముందు తన తల్లి నాగమణికి ఫోన్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు కావాలనే ఎక్కువ స‌మ‌య‌వ‌ డ్యూటీలు వేస్తున్నారని, సీనియర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు సమాచారం.

Osmania Hospital Suicide | కార‌ణాలు ఏంటి?

కొద్దిసేపటికి అతను అపస్మారక స్థితిలో పడిపోవడం గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వందలాది మంది జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. సురేష్ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సుమారు నాలుగు గంటల పాటు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ న‌ర‌సింహ Damodar Raja Narasimha స్పందించాలని నినాదాలు చేశారు.

Osmania Hospital Suicide |

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇక సురేష్ గత కొన్ని రోజులుగా డ్యూటీ సమయాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.

మరోవైపు, అతను డిప్రెషన్‌తో మందులు వాడుతున్నాడనే సమాచారం కూడా వినిపిస్తోంది. అయితే పోలీసులు వేధింపుల కోణంలో కూడా కేసును విచారిస్తున్నారు. హెచ్ఆర్‌డీఏ Telangana Healthcare Reforms Doctors Association (HRDA) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

వైద్య వృత్తిలో ముఖ్యంగా పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పనిభారం, మానసిక ఒత్తిడి, వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై అఫ్జల్‌గంజ్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేష్ మరణం వైద్య రంగంలో ఉన్న ఒత్తిడి, వ్యవస్థలోని లోపాలపై మళ్లీ చర్చకు దారి తీసింది.

ఇది కూడా చదవండి: Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!

Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన
Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
TAGGED:doctor mental healthhealthcare stress Indiahospital news TelanganaHyderabad doctor suicidejunior doctors protestmedical student harassmentOsmania Hospital SuicidePG student death India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 17 Pre Market Analysis April 17 Pre Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article Jasprit Bumrah Form Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంపై కోచ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?