Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంపై కోచ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంపై కోచ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

క్రీడలు

Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంపై కోచ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు జస్‌ప్రీత్ బుమ్రా. అత‌నిపై ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 10:08 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Jasprit Bumrah Form

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jasprit Bumrah Form | ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జ‌స్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Contents
  • Jasprit Bumrah Form | బుమ్రాపై న‌మ్మ‌కం..
    • Jasprit Bumrah Form | త్వరలోనే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి

ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం ముంబై ఇండియన్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Jasprit Bumrah Form | బుమ్రాపై న‌మ్మ‌కం..

అయితే ఈ విమర్శలకు జట్టు హెడ్ కోచ్ మ‌హేష్ జ‌య‌వ‌ర్ధ‌నే (Mahesh Jayawardene) గట్టి సమాధానం ఇచ్చాడు. జయవర్ధనే మాట్లాడుతూ, బుమ్రా ఫామ్ కోల్పోయాడనే అభిప్రాయాన్ని పూర్తిగా ఖండించాడు. “బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సమస్య అతడిలో లేదు. పవర్‌ప్లేలో మేము వికెట్లు తీయలేకపోవడం వల్ల ప్రత్యర్థి బ్యాటర్లు ఒత్తిడిలో పడటం లేదు. అందువల్ల వారు బుమ్రా బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొంటున్నారు” అని వివరించాడు. జట్టులో అనుభవజ్ఞులైన దీప‌క్ చాహ‌ర్ (Deepak Chahar), బౌల్ట్ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ, ప్రారంభ ఓవర్లలో వికెట్లు రాకపోవడం జట్టుకు నష్టం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. బౌలింగ్ విభాగం మొత్తం ఒక యూనిట్‌గా రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Jasprit Bumrah Form | త్వరలోనే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి

బుమ్రా ఒక్కసారి వికెట్లు  తీయడం మొదలుపెడితే, అతడిని ఆపడం చాలా కష్టం. అతడిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. జట్టులో అతడొక్కడే కాదు, ఇతర నాణ్యమైన బౌలర్లు కూడా ఉన్నారు. అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలి” అని జయవర్ధనే అన్నారు. ఇక జట్టులో కొన్ని గాయాలు, అనారోగ్య సమస్యలు కూడా ప్రణాళికలను దెబ్బతీశాయని ఆయన అంగీకరించాడు. త్వరలోనే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. బుమ్రా ప్రదర్శనపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ, ఇది వ్యక్తిగత వైఫల్యం కాదని, జట్టు సమష్టి సమస్యగా చూడాలని జయవర్ధనే స్పష్టం చేశాడు.

ఇది కూడా చదవండి..: Vinod Kambli Health | ఆందోళ‌న‌క‌రంగా వినోద్ కాంబ్లీ ఆరోగ్యం.. సాయం కోరుతూ ప్ర‌త్యేక వాట్సాప్ గ్రూప్

GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
Yuvraj Apology Dhoni Kapil Dev | తండ్రి చేసిన త‌ప్పు.. ధోని, క‌పిల్ దేవ్‌ల‌కు యువ‌రాజ్ క్ష‌మాప‌ణ‌లు
India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
Praful Hinge SRH | తొలి ఓవర్​లోనే మూడు వికెట్లు.. యువ బౌలర్​ ప్రఫుల్​ సంచలనం!
Bumrah Wicketless Streak | యార్కర్ కింగ్ బుమ్రాకు ఏమైంది?.. వరుస మ్యాచ్‌ల్లో ద‌క్క‌ని వికెట్‌, ఫ్యాన్స్‌లో ఆందోళన
TAGGED:Bumrah formcricket updatesDeepak ChaharIndian Premier LeagueIPL 2026ipl newsJasprit Bumrah FormMahela JayawardeneMahesh JayawardeneMumbai Indians
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Osmania Hospital Suicide Osmania Hospital Suicide | ఉస్మానియా ఆసుపత్రిలో విషాదం.. పీజీ విద్యార్థి ఆత్మహత్య.. వేధింపులే కార‌ణమా?
Next Article Women Reservation Act Women Reservation Act | మహిళా రిజర్వేషన్​ చట్టంపై గెజిట్​ నోటిఫికేషన్ విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?