Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ రైస్​ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ రైస్​ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం

తెలంగాణతాజా వార్తలు

CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ రైస్​ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం

యాసంగి సీజన్​కు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని సీఎం రేవంత్​రెడ్డి కోరారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 2:12 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
CM Revanth Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | యాసంగి సీజన్​కు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని సీఎం రేవంత్​రెడ్డి కోరారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​​ రెడ్డి (Uttam Kumar Reddy)తో కలిసి శుక్రవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పహ్లాద్​ జోషికి వినతి పత్రం అందించారు.

Contents
  • CM Revanth Reddy | సిద్ధంగా ఉన్నాం
    • CM Revanth Reddy | ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా..

యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌ (Boiled Rice Milling)కు తెలంగాణ అనుకూలమని సీఎం వివరించారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్​ రైస్​కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ (Telangana)లో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు.

CM Revanth Reddy | సిద్ధంగా ఉన్నాం

యాసంగి సీజన్ (Yasangi Season)​కు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని సీఎం కోరారు.

CM Revanth Reddy | ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా..

దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని సీఎం అన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారన్నారు. వెంటనే దానిని పునఃప్రారంభించాలని రేవంత్​రెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి..: Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత

Hydraa Demolitions Hyderabad | హైడ్రా దూకుడు.. ఐదు భారీ భవనాల కూల్చివేత
Census 2026 | మే 11 నుంచి జనగణన.. కలెక్టర్లకు సీఎస్​ సూచనలు
Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
Women Stomach Pain | మహిళల్లో కడుపు నొప్పి.. ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏ అనారోగ్యానికి సంకేతమంటే..!
TAGGED:agriculture news indiaBoiled Rice Millingboiled rice requestCentre approval riceCM Revanth Reddyfood grains IndiaMSP procurementTelanganaUttam Kumar ReddyYasangi Season
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tejasvi Surya Controversy Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి
Next Article Loan Waiver Issue Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా..? కాంగ్రెస్ సర్కారుపై వేముల నిప్పులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?