Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drinking Water Supply | తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి :కలెక్టర్ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Drinking Water Supply | తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి :కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Drinking Water Supply | తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి :కలెక్టర్ ఇలా త్రిపాఠి

వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ​సమీక్ష నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 3:34 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Drinking Water Supply

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Drinking Water Supply | వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పర్యవేక్షణ జరపాలని చూడాలన్నారు.

Contents
  • Drinking Water Supply | మండలా వారీగా సమీక్ష..
    • Drinking Water Supply | జిల్లా అధికారుల దృష్టికి తేవాలి
      • Drinking Water Supply | తాగునీటి పైప్​లైన్లను ధ్వంసం చేస్తే..

ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం (Armoor Constituency) పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల అధికారులతో కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు.

Drinking Water Supply | మండలా వారీగా సమీక్ష..

ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతు పనులు తదితర వాటి గురించి కలెక్టర్​ అడిగి తెలుసుకున్నారు. గతేడాది వేసవిలో ఏయే ప్రాంతాల్లో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్​నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున, తాగునీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని, చివరి ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాల్లోని నివాసాలకు సైతం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Drinking Water Supply | జిల్లా అధికారుల దృష్టికి తేవాలి

ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సకాలంలో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా మంచినీటి కోసం ప్రజలు నిరసనకు దిగితే, సంబంధిత ఎంపీడీవోలను (MPDO) బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకుని, ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలని చెప్పారు.

Drinking Water Supply | తాగునీటి పైప్​లైన్లను ధ్వంసం చేస్తే..

తాగునీటి (Drinking Water) సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్​లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్ లకు నష్టం చేకూర్చే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని కలెక్టర్ చెప్పారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీవోలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భగీరథ ఈఈ రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీవోలు, ఏఈలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై వేముల నిప్పులు

Artisan Workers Demand | సర్వీస్ రూల్స్​తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్
Alumni Reunion 1960 Batch | 66 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..
Kamareddy Indoor Stadium | ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం: షబ్బీర్​అలీ
Temple Theft Arrest | ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల అరెస్టు..
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:Armoor ConstituencyCollector Ila TripathiDrinking WaterDrinking Water Supplylocal governanceMission BhagirathaMPDONizamabad NewsPublic UtilitiesSummer PreparednessTelangana administrationWater Supply
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Croma Akshaya Tritiya Deals Croma Akshaya Tritiya Deals | క్రోమా ‘గోల్డెన్ డీల్స్’.. అక్షయ తృతీయ ఆఫర్ల సువర్ణావకాశం.. ఏసీలు, టీవీలపై 50% వరకు తగ్గింపు!
Next Article Telangana Jagruthi Posters Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?