అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalkuntla Kavitha) ఆధ్వర్యంలో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తమ కొత్త పార్టీకి సంబంధించి ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు.
Telangana Jagruthi Posters | హైదరాబాద్ శివారులోని అద్వైయ కన్వెన్షన్లో..
ఈనెల 25 హైదరాబాద్ శివారులో జరిగే తెలంగాణ (Telangana) నూతన పార్టీపేరును కవిత అధికారికంగా విడుదల చేయనున్నారని జాగృతి అడహక్ కమిటీ సభ్యుడు అవంతి రావు తెలిపారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ (Nizamabad) నుంచి సుమారు 15వేల మందితో ఈ కార్యక్రమానికి తరలి వెళ్లనున్నామన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవిత కోసం 200 కార్లు 200 బస్సులు నిజామాబాద్ జిల్లా నుంచి బయలుదేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో రజాక్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, కృష్ణమోహన్, ప్రవీణ్, నరేష్ నాయక్, కరిపె రాజు, రాఘవేందర్ బర్ల నరేష్, శోభవతి, రేఖ, అంజలి, దాత్రిక రేఖ, కౌసల్య, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి :కలెక్టర్ ఇలా త్రిపాఠి
