అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం (Central Government) మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే యత్నం చేస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. 2023లోనే మహిళా బిల్లును మనం ఆమోదించినట్లు గుర్తు చేశారు. అంతగా కావాలంటే పాత మహిళా బిల్లును రద్దు చేసి.. ఇప్పుడు మళ్లీ తీసుకురండని సూచించారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన మహిళా బిల్లుతో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. మన జాతీయ భావనలో మహిళలు ఒక చోదక శక్తిగా ఉన్నారన్నారు.
Rahul Gandhi | మాకు ఆ సమస్య లేదు
మనమందరం మన జీవితాల్లోని మహిళల ద్వారా ప్రభావితం అయ్యాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, వారి నుంచి ఎంతో జ్ఞానాన్ని గ్రహించామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధానమంత్రికి, నాకు మాత్రం ఆ ‘భార్య’ అనే అంశం (సమస్య) లేదని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు మహిళల కోసం ఉద్దేశించినది కాదని రాహుల్ విమర్శించారు. దీనికి మహిళా సాధికారతతో ఎటువంటి సంబంధం లేదన్నారు.
Rahul Gandhi | ఓబీసీలకు అన్యాయం
భారతీయ సమాజం దళితులను, ఇతర వెనుకబడిన తరగతుల వారిని మరియు ఆ వర్గాలకు చెందిన మహిళలను ఏ విధంగా చూసిందనేది ఒక చారిత్రక సత్యం. కుల గణన (Caste Census) ప్రక్రియను పక్కదారి పట్టించడానికే ప్రభుత్వం ప్రస్తుతం బిల్లును తెచ్చిందన్నారు. ఓబీసీ సోదర సోదరీమణులకు అధికారాన్ని, ప్రాతినిధ్యాన్ని కల్పించకుండా తప్పించుకోవడానికి, వారి చేతుల్లో ఉన్న అధికారాన్ని లాగేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Rahul Gandhi | బీజేపీ భయపడుతోంది
బీజేపీ (BJP) చేస్తున్న ఈ పనికి కారణం ఏమిటంటే దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసి ఆ పార్టీ భయపడుతోందన్నారు. వారి బలం క్షీణిస్తుండటాన్ని చూసి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అందుకే దేశ రాజకీయ చిత్రపటాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అస్సాంలోనూ, జమ్మూ కాశ్మీర్‌లోనూ ఇలాగే చేశారని చెప్పారు.బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని హరించి వేసే కుట్ర చేస్తోందన్నారు. దేశం ఆత్మను చంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Women Reservation Bill | నారీశక్తికి ముళ్లకంచే వేసిన ప్రధాని : శశిథరూర్
