అక్షరటుడే, వెబ్డెస్క్ : Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (MP Shashi Tharoor) శుక్రవారం లోక్సభలో ప్రసంగించారు. ప్రభుత్వం నారీశక్తికి న్యాయం అనే బహుమతిని ఇచ్చిందని ప్రధానమంత్రి అంటున్నారని, కానీ ఆయన దానికి ముళ్లకంచె వేశారన్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు లింక్ చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ల (Women Reservations) అమలుకు సిద్ధంగా ఉందని చెప్పారు. దానిని నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టడం అంటే, మన దేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, సంక్లిష్టమైన పరిపాలనా ప్రక్రియలలో ఒకదానికి భారతీయ మహిళల ఆకాంక్షలను బందీగా ఉంచడమే అన్నారు.
Women Reservation Bill | ఆ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత
భవిష్యత్ డీలిమిటేషన్ల (Delimitations)లో జనాభా పెరుగుదలను అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు అధిక రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని శశిథరూర్ అన్నారు. పరిపాలనలో శ్రేష్ఠత రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయేలా చేస్తుందనే సందేశాన్ని మనం పంపాలనుకుంటున్నామా అని ప్రశ్నించుకోవాలన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో చూపినంత తొందరపాటుతోనే డీలిమిటేషన్‌ను ప్రతిపాదించారని విమర్శించారు. దురదృష్టవశాత్తు నోట్ల రద్దు దేశానికి ఎంత నష్టం చేసిందో మనందరికీ తెలుసన్నారు.
దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. రాజకీయ కారణాలతో మరింత ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందాలన్నారు. కానీ డీలిమిటేషన్‌తో ముడిపెడుతుండటం రిజర్వేషన్ల ఆశయాన్ని దెబ్బతీయడమే అవుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Rajya Sabha Deputy Chairman | రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ నారాయణ్ ఎన్నిక
