అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajya Sabha Deputy Chairman | రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం నిర్వహించారు. నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా వరుసగా మూడో సారి ఎన్నికయ్యారు. . జనతా దళ్ (యునైటెడ్) పార్టీ సభ్యుడిగా ఉన్న ఈయన రాజ్యసభలో బీహార్ (Bihar) రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ప్రతిపక్షాల నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో, హరివంశ్ నారాయణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2018 నుంచి ఈ పదవిలో సేవలందిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు హిందీ దినపత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. బీహార్‌లో జన్మించిన హరివంశ్ గతంలో మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్‌కు సలహాదారుగా పనిచేశారు.
Rajya Sabha Deputy Chairman | మోదీ అభినందనలు
హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మాట్లాడారు. వరుసగా మూడోసారి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం అనేది ఆయనపై ఈ సభకు ఉన్న ప్రగాఢ విశ్వాసానికి, గత కాలంలో మీ అనుభవం వల్ల సభ పొందిన ప్రయోజనాలకు, అందరినీ కలుపుకొని వెళ్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనం అని కొనియాడారు. హరివంశ్ నాయకత్వంలో సభ బలం మరింత సమర్థవంతంగా పెరగడాన్ని మనమందరం చూశామని పేర్కొన్నారు. డిప్యూటీ ఛైర్మన్ కొత్త పదవీకాలం కూడా ఇదే స్ఫూర్తి, సమతుల్యత, అంకితభావంతో కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్ షా
