అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Gains | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు ఉండడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడం, ఎఫ్ ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో నమ్మకం బలపడుతోంది. దీంతో ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నా.. మన మార్కెట్లు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నాయి.
Stock Market Gains | నష్టాలతో ప్రారంభమై..
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 250 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 632 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 69 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 208 పాయింట్లు లాభపడింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 295 పాయింట్ల లాభంతో 78,284 వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 24,276 వద్ద ఉన్నాయి.
Stock Market Gains | ఐటీ మినహా..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఐటీ మినహా మిగిలిన సూచీలు పాజిటివ్‌గా ఉన్నాయి. నిఫ్టీ (Nifty)లో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.63 శాతం, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మీడియా ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 0.45 శాతం నష్టంతో కదలాడుతోంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌యూఎల్ 4.05 శాతం, మారుతి 2.21 శాతం, ట్రెంట్ 1.68 శాతం, రిలయన్స్ 1.46 శాతం. ఆసియన్ పెయింట్ 1.38 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 1.26 శాతం, టైటాన్ 0.80 శాతం, సన్‌ఫార్మా 0.73 శాతం, ఎటర్నల్ 0.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.53 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: April 17 Gold Rates | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధర!
