అక్షరటుడే, ఆర్మూర్ : Beach Volleyball Nationals | ఆర్మూర్ మండలం (Armoor Mandal)లోని మగ్గిడి పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు సుంకరి ప్రతిప, శార్తి రిషి ప్రియ అండర్-17 ఎస్జీఎఫ్ బీచ్ వాలీబాల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మధు తెలిపారు.
Beach Volleyball Nationals | ఏప్రిల్లో గోవా రాష్ట్రంలో..
డిసెంబర్లో ఖమ్మం (Khammam)లో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో తెలంగాణ జట్టు తరపున ఈ క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. దీంతో తెలంగాణ జాట్టు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. గోవా (Goa) రాష్ట్రంలోని పానాజీలో ఏప్రిల్ 21నుంచి 24 వరకు జరిగే ఈ పోటీలు జరుగనున్నాయి. బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ జట్టులో క్రీడాకారిణులు ప్రతిష, రిషిప్రియ ఆడనున్నట్లు పీడీ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను నిజామాబాద్ ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ నాగమణి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరునగిరి హరిత, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి..: Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలి
