అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త నాయకత్వం ముందుకొస్తుందన్నారు. ఈ క్రమంలో రాజకీయ వారసత్వం పోతుందన్న భయంతో.. బిల్లును పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. అది MIM అసదుద్దీన్ ఒవైసీ హైబ్రిడ్ ఫార్ములా అన్నారు. డీలిమిటేషన్‌పై తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల (Women’s Reservations)కు ఎంఐఎం వ్యతిరేకమన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
Delimitation Bill | తప్పుడు ప్రచారం
డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ బిల్లుతో ఎవరికి నష్టం జరగదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ప్రధాని మోదీ (Prime Minister Modi) హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆదాయం ఎక్కువగా వస్తుందని హైదరాబాద్‌లోనే రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సీట్లు పెంచుతారా అని ప్రశ్నించారు. డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Sigachi accident compensation | సిగాచి ప్రమాద బాధితులను మోసం చేసిన సీఎం : హరీశ్‌రావు
