Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sigachi accident compensation | సిగాచి ప్రమాద బాధితులను మోసం చేసిన సీఎం : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Sigachi accident compensation | సిగాచి ప్రమాద బాధితులను మోసం చేసిన సీఎం : హరీశ్​రావు

తెలంగాణ

Sigachi accident compensation | సిగాచి ప్రమాద బాధితులను మోసం చేసిన సీఎం : హరీశ్​రావు

సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని నిలుపుకోలేక సీఎం రేవంత్​రెడ్డి తన అసమర్థతను చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 11:06 ఉద.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Sigachi accident compensation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sigachi accident compensation | సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక సీఎం రేవంత్​రెడ్డి తన అసమర్థతను చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో గతేడాది జరిగిన ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Contents
  • Sigachi accident compensation | రూ.45.40 లక్షలే..
    • Sigachi accident compensation | యాజమాన్యం మోసం

ప్రమాదం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటిపరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే అందులో సగం కూడా ఇవ్వలేదని హరీశ్​రావు విమర్శించారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యాయన్నారు.

Sigachi accident compensation | రూ.45.40 లక్షలే..

యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని హరీశ్​రావు (Harish Rao) మండిపడ్డారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన 24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం 45.40 లక్షలు మాత్రమే అననారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు 54.60 లక్షల చొప్పున, మొత్తంగా 29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని విమర్శించారు.

Sigachi accident compensation | యాజమాన్యం మోసం

యాజమాన్యం తాము రూ.40 నుంచి రూ.42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకుందన్నారు. అయితే ఆ సంస్థ సొంతంగా ఇచ్చిందిరూ.25 లక్షలు మాత్రమేనని చెప్పారు. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బును కూడా కంపెనీ జేబులో నుంచి ఇస్తున్నట్లు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని హరీశ్​రావు అన్నారు. అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పీఎఫ్, ఈఎస్ఐ (ESI) డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Microfinance Fraud Arrest | మైక్రో ఫైనాన్స్​ కేసులో రమావత్​ మధు అరెస్ట్

BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
BRS name change | మళ్లీ టీఆర్​ఎస్​గా బీఆర్​ఎస్​.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు
Hyderabad Fire Accident | ఫర్నిచర్​ షాపులో భారీ అగ్ని ప్రమాదం
Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
ACB Raids | ఎక్సైజ్​ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు
TAGGED:compensation issueGovernment CriticismHarish Raoindustrial accidentRevanth ReddySigachi accidentTelangana Politicsworkers safety
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hemophilia Awareness Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలి
Next Article Candescent Hyderabad Candescent Hyderabad | కోర్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ హబ్‌గా భారత్: హైదరాబాద్‌లో కాండిసెంట్ కొత్త టెక్ సెంటర్ ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?