అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Grain Procurement Control Room | జిల్లాలో వరిధాన్యం సేకరణ, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల (grain procurement) ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను శుక్రవారం ప్రారంభించారు.
Grain Procurement Control Room | ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు..
జిల్లాలో (nizamabad news) ధాన్యం, మొక్కజొన్న, పసుపు (turmeric purchase) విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూం 08462-220183 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు. ప్రతిరోజు ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు కంట్రోల్ రూం పనిచేస్తుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు కంట్రోల్ రూంలో అందుబాటులో ఉంటారని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా.. వరి ధాన్యం అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 1967కు లేదా 180042500333కు కూడా రైతులు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం ప్రవీణ్, ఏఎస్వో అర్వింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
