అక్షరటుడే, ఆర్మూర్: Armoor Illegal Activities | ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై మున్సిపల్, పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని.. సమన్వయంతో వాటిని అరికట్టాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Armoor Illegal Activities | పనులను పూర్తి చేయాలి
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో మిగిలిపోయిన సీసీ,బీటీ రోడ్లు, డ్రెయినేజీలు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రజలకు నీటి సరఫరాను అందించాలన్నారు. కొందరు కౌన్సిలర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు తనకు ఫిర్యాదు చేశారని..నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మాణాలు నిర్మించుకోవాలని ఎవరికీ సమాధానం చెప్పే అవసరం లేదని ఎమ్మెల్యే సూచించారు.
Armoor Illegal Activities | పనుల కోసం..
మున్సిపాలిటీ (Municipality)లో పనుల కోసం ఏ రాజకీయ నాయకుడిని, ఎమ్మెల్యేని కలిసే అవసరం లేదని అన్నారు. నేరుగా అధికారులను కలిసి నిబంధనల ప్రకారం పనులు చేయించుకోవాలన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయాన్ని తగ్గించాలని మున్సిపల్ అధికారులకు ఆయన సూచించారు. అవినీతి కనబడితే ఆర్మూర్ ప్రజలు తనకు ఫోన్లో ఫిర్యాదు చేస్తే తానే నేరుగా ఆ ప్రాంతానికి వస్తానన్నారు. కొంతమంది విలేకరుల ముసుగులో సైతం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫొటోలు తీయడం అధికారులను బెదిరించడం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మంది తాగి భార్య ఆత్మహత్య..
