అక్షరటుడే, బాన్సువాడ: Women Rights Protest | దేశంలో మహిళా హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని.. కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లును అడ్డుపడిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Women Rights Protest | నారీశక్తి వందన్ చట్టాన్ని నీరుగార్చారు..
కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీసుకువచ్చిన నారీశక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించిందన్నారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లుకు కాంగ్రెస్ కూటమి ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం మహిళల సాధికారతకు విరుద్ధమని విమర్శించారు. మహిళల హక్కులను కాపాడాల్సిన పార్టీలు ఇలాంటి కీలక అంశాల్లో వ్యతిరేకంగా నిలవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Women Rights Protest | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
రాబోయే ఎన్నికల్లో మహిళలు తమ ఓటుతో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విపక్షాలు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ (BJP) జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పాశం ఆమని, భాస్కర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు అనిల్, సిద్ది బాలరాజ్, రామకృష్ణ, రూరల్ అధ్యక్షుడు మజ్జిగ శ్రీనివాస్, మహిళా నాయకులు రేణుక, విజయలక్ష్మి, లక్ష్మీ, ఐశ్వర్య, యమున, సవిత, లావణ్య, సారిక, అంకిత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Armur Illegal Activities | ఆర్మూర్ బల్దియా పరిధిలో అక్రమలను అరికట్టాలి..: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
