అక్షరటుడే, వెబ్‌డెస్క్: MPTC ZPTC Elections | రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంతో ఆ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. దీంతో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.
MPTC ZPTC Elections | మేలో ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించినా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అనంతరం తెచ్చిన ఆర్డినెన్స్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో కోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామని గతంలో ప్రకటించింది. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) బీసీ రిజర్వేషన్ల అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
MPTC ZPTC Elections | 566 జడ్పీటీసీలు, 5,773 ఎంపీటీసీలు
గతంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ (Election Commission Notification) విడుదల చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో అప్పుడు షెడ్యూల్ వెలువడింది. నామినేషన్లు సైతం స్వీకరించారు. అయితే బీసీ రిజర్వేషన్లను కోర్టు కొట్టేయడంతో నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో మళ్లీ షెడ్యూల్ విడుదల చేయనుంది. అయితే గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ప్రకటించిన రిజర్వేషన్లు మారనున్నాయి. అప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఆయా స్థానాలను ఖరారు చేశారు. ప్రస్తుతం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం 566, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి..: KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్
