Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్​

తెలంగాణతాజా వార్తలు

KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్​

మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు శనివారం జగిత్యాలలో పర్యటించారు. కేసీఆర్​ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 3:28 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
KTR Jagtial Speech

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Jagtial Speech | మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు శనివారం జగిత్యాలలో పర్యటించారు. ఈ నెల 20న మాజీ మంత్రి జీవన్​రెడ్డి (Former Minister Jeevan Reddy) బీఆర్​ఎస్​లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగిత్యాలలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. దీనికి కేసీఆర్​ సైతం హాజరు కానున్నారు.

Contents
  • KTR Jagtial Speech | చిల్లర ముఖ్యమంత్రి
    • KTR Jagtial Speech | మౌనంగా కూర్చున్నారు
      • KTR Jagtial Speech | కేంద్ర మంత్రి ఇంటికి సీఎం

కేటీఆర్​, హరీశ్​రావు శనివారం హైదరాబాద్​ నుంచి ఒకే కారులో జగిత్యాలకు వచ్చారు. కేసీఆర్​ (KCR) సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. సింహం బయటికి వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో దడ పుడుతుందన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ పెడతానంటే ఆ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

KTR Jagtial Speech | చిల్లర ముఖ్యమంత్రి

మేడిగడ్డ పోయేందుకు రెండేళ్లుగా రేవంత్ రెడ్డికి సమయం లేదు కానీ కేసీఆర్ సభ పెట్టిన రోజే వెళ్తున్నారన్నారు. జగిత్యాలకు వచ్చే రోడ్డు మూడేళ్లలో గుర్తులేదు కానీ ఈరోజే తవ్విస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైట్ ఒకటే అనుకున్నా మెదడు కూడా చిన్నదే అని ఎద్దేవా చేశారు. ఇంత చిల్లర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో తన పర్యటనలో గాయపడిన జర్నలిస్టు మిత్రుడికి నయం అయ్యేవరకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

KTR Jagtial Speech | మౌనంగా కూర్చున్నారు

లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ (BRS) ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని హరీశ్​రావు అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే.. తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ.. మాట్లాడిన తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన సమాధానం చెప్పేవాళ్లమన్నారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా మౌనంగా కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి తేజస్వి సూర్యను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

KTR Jagtial Speech | కేంద్ర మంత్రి ఇంటికి సీఎం

మహిళా బిల్లుకు కాంగ్రెస్ (Congress) మద్దతు ఇవ్వలేదని హరీశ్​రావు అన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించండని బీజేపీ వాళ్ళు పిలుపునిచ్చారని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ చేయడానికి పోయారని తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ ఖండించలేదన్నారు. అసలు బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి రిలేషన్ ఏమిటని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: GHMC Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం

Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..
March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
TAGGED:BRSbrs leaders newsCM Revanth ReddyCongressCongress vs BRSFormer Minister Jeevan Reddyharish rao commentsKCRkcr meeting jagtialktr comments todayKTR Jagtial SpeechTelangana politics news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road Accident Awareness Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..
Next Article Premier League Rally Premier League Rally | జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?