Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Premier League Rally | జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Premier League Rally | జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ

నిజామాబాద్

Premier League Rally | జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ

జిల్లా కేంద్రంలో ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. సీపీ సాయి చైతన్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 4:36 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Premier League Rally

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Premier League Rally | జిల్లా కేంద్రంలో ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కౌన్సిల్​ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, ఆయా కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఉదయం డీఎస్​ఏ మైదానం నుంచి పాలిటెక్నిక్​ గ్రౌండ్​ (Polytechnic Ground) వరకు సాగింది.

Contents
  • Premier League Rally | ప్రీమియర్​ లీగ్​ నిర్వహణ అభినందనీయం
    • Premier League Rally | యువతను సన్మార్గంలో నడిపించేందుకే..

Premier League Rally | ప్రీమియర్​ లీగ్​ నిర్వహణ అభినందనీయం

డీఎస్​ఏ గ్రౌండ్​లో ప్రీమియర్​ లీగ్​ ర్యాలీని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్​ లీగ్​ నిర్వహించనుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంతోమంది క్రీడాకారులను దేశానికి అందించినటువంటి ఘనత నిజామాబాద్​ జిల్లాకు ఉందన్నారు. ఈ ప్రీమియర్ లీగ్​లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా లాంటి క్రీడలు నిర్వహిస్తున్నారని, ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు.

Premier League Rally

Premier League Rally | యువతను సన్మార్గంలో నడిపించేందుకే..

ఈ క్రీడల్లో గెలుపొందినటువంటి వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని సీపీ అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో యువతను ప్రోత్సహించేందుకు ఈ లీగ్​ నిర్వహిస్తన్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయారని, కాని రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో 2025లో 300 మంది మరణించారన్నారు. రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఎక్కువగా నిర్లక్ష్యమైన డ్రైవింగ్​తోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్​ఎస్​సీ ఛైర్మన్ సాయి చైతన్య, కన్వీనర్ బస్వారెడ్డి, జనరల్​ సెక్రెటరీ కవితా రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్​ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ ​సెక్రెటరీ రజనీకాంత్​ (ఫిజికల్​ సెక్యూరిటీ), డాక్టర్​ శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), పితానీ, శివప్రసాద్​, గణేష్ గుప్తా, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..

Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
TAGGED:CP Sai ChaitanyaNizamabad NewsNizamabad Policepolice initiativePolytechnic GroundPremier League RallyRoad Accidentssports promotion IndiaTelangana sports eventsyouth participation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KTR Jagtial Speech KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్​
Next Article Telangana University | Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?