అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా కాకతీయ విద్యాసంస్థల(Kakatiya Institutions) అధినేత చెరుకూరి రజనీకాంత్ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(All India Forward Bloc) జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ ఘనంగా సన్మానించారు.
Telangana University | యూనివర్సిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి..
రాజుగౌడ్ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం పాలకమండలి సమావేశాల్లో విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. యూనివర్సిటీ(TU)ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరారు. కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలని.. వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేయాలని ఆయన కోరారు. యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా రజనీకాంత్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.
