అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana University Board | నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న కాకతీయ విద్యా సంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్ రజనీకాంత్ తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తన విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయనను తాజాగా తెయూలో కీలక పదవి వరించడం విశేషం.
నిజామాబాద్ జిల్లాలో కాకతీయ విద్యా సంస్థల ద్వారా పాఠశాల స్థాయి నుంచి ఇంజినీరింగ్ వరకు మెరుగైన విద్య అందిస్తున్నారు. విద్యా సంస్థల డైరెక్టర్ చెరుకూరి రజనీకాంత్ జిల్లాలో విద్యా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన ఇప్పటికే సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా తెయూ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పబ్లిక్ లైఫ్, లాయర్ వృత్తి, సామాజిక సేవలు వంటి రంగాల నుంచి కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్, అల్లె లావణ్య, మహమ్మద్ గాజి, డాక్టర్ ఎస్.జయంత్‌ను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana University Board | అభినందనల వెల్లువ
కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ తెయూ పాలక మండలి సభ్యుడిగా నియమితులు కావడంతో పలువురు అభినందనలు తెలిపారు. విద్యా సంస్థల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఆయన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన పదవితో మరింత బాధ్యత పెరిగిందని రజనీకాంత్ తెలిపారు. జిల్లాల్లో విద్య అభివృద్ధి, తెలంగాణ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Nizamabad bus accident | బస్సు ఢీకొని యాచకుడి మృతి
