అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GHMC Encroachment Drive | హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురి అయ్యాయి. దీంతో ప్రజలు రోడ్లపై నడుస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officials) ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో చాలా వరకు ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురి అయ్యాయి. వాటిపై పాన్ డబ్బాలు పెట్టుకొని వేలాది మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, సంస్థలు, షాపింగ్ మాళ్లు సైతం ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను తొలగిస్తున్నారు.
GHMC Encroachment Drive | ఆరు జోన్లలో..
పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలోని 6 జోన్‌లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మించిన వందలాది శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను తొలగించింది. జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అధికారులు ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తున్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రి, మహేశ్వరి పరమేశ్వరి థియేటర్, సుల్తాన్ బజార్ రోడ్, కాచిగూడ జంక్షన్ సమీపంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. పాదచారుల రాకపోకలను మెరుగుపరచడం, బహిరంగ ప్రదేశాల్లోని అడ్డంకులను తొలగించడం తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు!
