అక్షరటుడే, వెబ్‌డెస్క్ః Ramchander Rao House Arrest | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్లమెంట్లో బిల్లులు వీగిపోయిన క్రమంలో బీజేపీ.. నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) ఇంటి ఎదుట నిరసన, ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Ramchander Rao House Arrest | అప్రమత్తమైన పోలీసులు
బీజేపీ (BJP) నిర్ణయంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా పలువురు బీజేపీ నాయకులు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Ramchander Rao House Arrest | మహిళలకు రిజర్వేషన్ దక్కకుండా కాంగ్రెస్ కుట్ర
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ (Congress) కుట్ర చేస్తోందని విమర్శించారు. నారీశక్తికి ద్రోహం చేసిన ఆ పార్టీని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆ పార్టీ తీరును గల్లీగల్లీలో ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. నారీశక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను మహిళా లోకం ఎప్పటికీ క్షమించదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టాలనుకున్న నిరసనలను అణచివేస్తోందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు!
