అక్షరటుడే, వెబ్‌డెస్క్ః Afghanistan Earthquake | ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan)లో భూకంపం వచ్చింది. శనివారం ఉదయం ఆ దేశంలోని పలు ప్రాంతాలు 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే కాశ్మీర్ లోయలో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజల భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Afghanistan Earthquake | ఉదయం 8.24 గంటల సమయంలో..
సీస్మోలాజికల్ (Seismological) వివరాల ప్రకారం.. ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం ఉదయం 8:24 గంటల సమయంలో సంభవించింది. దీని కేంద్ర బిందువు బడఖ్షాన్ ప్రాంతంలోని జైబక్ సమీపంలో గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండడం వల్ల ఉపరితలంపై దాని ప్రభావం గణనీయంగా తగ్గింది.
Afghanistan Earthquake | కాశ్మీర్ వరకు ప్రకంపనలు
ఆఫ్ఘానిస్తాన్‌లో సంభవించిన భూకంపం వల్ల కాశ్మీర్ (Kashmir)లోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఇది కూడా చదవండి..: Strait of Hormuz Tensions | హార్మూజ్‌లో నౌకల రాకపోకలకు అనుమతి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్
