అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP Jagtial | మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఫండ్‌ను ఇన్‌ఛార్జి భోగ శ్రావణి (Bhoga Sravani) నొక్కేశారని కౌన్సిలర్ అభ్యర్థులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరిగిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. పలు చోట్ల బీఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కువ సీట్లు గెలవాలని ఎంపీ అర్వింద్ (MP Arvind) ప్రయత్నించారు. అయితే అక్కడ అధికార కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతోంది. ఈ క్రమంలో తాజాగా జగిత్యాల బీజేపీ ఇన్‌ఛార్జి భోగ శ్రావణిపై కౌన్సిలర్ అభ్యర్థులు ఆరోపణలు చేయడం గమనార్హం.
BJP Jagtial | పార్టీ ఆఫీస్‌లో ఆందోళన
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ (BJP) అభ్యర్థులు శనివారం పార్టీ ఆఫీసులో ఆందోళన చేపట్టారు. పార్టీ ఫండ్ విషయంలో భోగ శ్రావణి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 50 వార్డులకు గాను 46 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే.. ఒక్కొక్కరికి రూ.2,15,000 రావాల్సి ఉండగా మొత్తం ఇవ్వలేదన్నారు. కొందరికి రూ.50 వేలు, మరికొందరికి రూ.లక్ష మాత్రమే భోగ శ్రావణి ఇచ్చారని, మిగతావి ఆమె నొక్కేశారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కౌన్సిలర్‌గా పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో నిజ నిర్ధారణ కమిటీ జగిత్యాలలో విచారణ చేపట్టింది.భోగ శ్రావని ప్రచారానికి కూడా సహకారం అందించలేదని అభ్యర్థుల విమర్శించారు. పూర్తి నిధుల వివరాలు బయట పెట్టి.. శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Ramchander Rao House Arrest | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
