అక్షరటుడే, వెబ్డెస్క్: DA Hike | కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్ చెప్పింది. డీఏ 2 శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచడానికి శనివారం జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting)లో ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని చివరిసారిగా అక్టోబర్‌లో సవరించారు. అప్పుడు దానిని 55 శాతం నుంచి 58 శాతానికి పెంచారు. ఈ పెంపును జూలై 1, 2025 నుండి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత దీనిని బకాయిలతో కలిపి అమలు చేశారు. తాజాగా మరో రెండు శాతం డీఏ పెరిగింది. దీంతో 60శాతానికి పెరిగింది.
DA Hike | ఉద్యోగులకు ప్రయోజనం
డీఏ పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది. సవరించిన ఈ డీఏ జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. రూ. 30 వేల మూల వేతనం కలిగిన ఒక ఉద్యోగికి ఈ సవరణ ఫలితంగా నెలకు రూ.600 అదనంగా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల (Government employees) వేతన ప్యాకేజీలో డీఏ కీలక భాగం. ముఖ్యంగా రాబోయే వేతన సంఘం గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో డీఏ పెరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి..: Delimitation Bill | లోక్సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
