అక్షరటుడే, ఇందూరు: Women Reservation Bill | మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్కు భవిష్యత్తులో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Women Reservation Bill | కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ (Congress) నిజస్వరూపం బయటపడిందని అన్నారు. 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికతను బయట పెట్టాయన్నారు. మహిళా శక్తి అంటూ చెప్పే కాంగ్రెస్ అవకాశం ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గిపోవడం సిగ్గుచేటన్నారు. మోదీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Women Reservation Bill | ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో బీజేపీ (BJP) ముందడుగు వేసింది అన్నారు. 60ఏళ్లుగా కాంగ్రెస్ చేయని మహిళా బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బిలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి మహిళా నాయకురాలు వనిత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Women Reservation Bill Protest | భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు…
