అక్షరటుడే, లింగంపేట: Certified Seeds Farming | తెలంగాణ ప్రభుత్వం రైతులు (Telangana farme) ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వం సూచించిన విత్తనాలని రైతులు సాగు చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (State Seed Development Corporation) ఛైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో గురువారం రైతులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Certified Seeds Farming | నాణ్యమైన విత్తనాలు అందజేస్తున్నాం..
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మన రైతులతో విత్తనాలను ఉత్పత్తి చేసి, అవసరమైన పరీక్షల అనంతరం మాత్రమే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తున్నదని అన్వేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత వానకాలం (Rainy Season) సీజన్‌కు అవసరమైన వరి విత్తనాలు సన్న రకాలైన బీపీటీ 5,204, ఆర్‌ఎన్‌ఆర్ (RNR) 15048, కెఎన్‌ఎం 1638, దొడ్డు రకాలైన కెఎన్‌ఎం 118, ఎంటీఎం 1010 సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వానాకాలం సీజన్‌కు అవసరమైన జీలుగ జనుము విత్తనాలను సకాలంలో అందజేస్తామని తెలిపారు. నూతన విత్తన చట్టం రూపకల్పనలో రైతుల హక్కులను కాపాడటం గురించి రైతులకు వివరించారు.
Certified Seeds Farming | రైతులు పంట మార్పిడి చేయాలి
రైతులు వరి పంట మాత్రమే కాకుండా పంట మార్పిడితో మిగతా పంటలు కూడా సాగు చేయాలని కోరారు. పంట మార్పిడితో రైతులకు అధిక దిగుబడి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టెం శ్రీను, ఆత్మ ఛైర్మన్ దశరత్ నాయక్, సర్పంచ్ సంఘం ఫోరం అధ్యక్షుడు సక్రు నాయక్, ఉప సర్పంచ్ మన్నే బాలయ్య, అయ్యపల్లి సర్పంచ్ గోనె లింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, పూల్ సింగ్, వార్డు సభ్యులు, రైతులు వ్యవసాయ అధికారులు, ఏవో అనిల్ కుమార్, ఏఈవోలు విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Paresh Rawal IMF Comment | హోటల్ బిల్లు కట్టేదెవరు?
