అక్షరటుడే, బోధన్: Road Accidents Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీ సాయిచైతన్య(CP Sai chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి (Yedapally) పోలీస్స్టేషన్ పరిధిలోని మంగల్పాడ్ చౌరస్తా వద్ద ప్రజలకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Road Accidents Awareness | ట్రాఫిక్ నియమాలు తూచా తప్పకుండా పాటించాలి..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్(Arrive Alive) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీంట్లో భాగంగా 6వరోజు శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఎడపల్లిలో జరుపుతున్నామన్నారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.
Road Accidents Awareness | అతివేగం.. నిర్లక్ష్యం..
రోడ్డుపై అతివేగం.. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు పెరుగుతున్నాయని సీపీ అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయ్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో(Golden Hour) ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఎవరైతే హాస్పిటల్ తరలిస్తారో, అతనికి ప్రభుత్వం నుంచి ప్రోతాసహం రూ.25వేలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రమ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది తదితరులున్నారు.
