అక్షరటుడే, కామారెడ్డి: Chaitanya Reddy Transfer | కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ అయ్యారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డి డీఎస్పీలుగా మాత్రమే ఇక్కడ పని చేసేవారు.
Chaitanya Reddy Transfer | 15 నెలల పాటు
మొట్టమొదటిసారిగా సబ్ డివిజన్ ఏఎస్పీ స్థాయి అధికారిణిగా చైతన్య రెడ్డి 2025 జనవరి 1 న బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో దాదాపు 15 నెలల పాటు పనిచేశారు. ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విధుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
కేసుల విచారణలో పారదర్శకత పెంచేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ముఖ్యంగా షీ టీం బలోపేతం కోసం కృషి చేశారు. గ్రామాల్లో షీ టీంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పొక్సో కేసుల విచారణతో నిక్కచ్చిగా వ్యవహరించారు.
Chaitanya Reddy Transfer | భరోసా నింపే ప్రయత్నం
తప్పు చేసిన వ్యక్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నారు. దాంతో కేసుల విషయంలో ఏఎస్పీ వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. మహిళా సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పొక్సో కేసు బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేయగా ఇటీవల అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. ఏఎస్పీ బదిలీ తర్వాత కొత్తగా ఎవరు రానున్నారనేది ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే గతంలో మాదిరిగా డీఎస్పీ క్యాడర్ అధికారి వస్తారా..? లేక సబ్ డివిజన్ ఏఎస్పీ హోదాలో నియమిస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
