అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కామారెడ్డిలో(kamareddy) కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లే తన ప్రియుడిని పురమాయించి హత్య చేయించిందని తేలింది.
Kamareddy Police | రాజంపేట్‌కు చెందిన..
ఈ మేరకు కామారెడ్డి(Kamareddy Police) పట్టణ సీఐ నరహరి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన రజిత అలియాస్ లక్ష్మీకి ఆర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్‌తో 2014లో వివాహం అయింది. వీరికి ఐదేళ్ల కుమారుడు శ్రావణ్, ఎనిమిదేళ్ల కూతురు సమీరా ఉన్నారు.
అయితే భర్తతో గొడవల కారణంగా ఆరు నెలల క్రితం రజిత(లక్ష్మీ) తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరాంనగర్ కాలనిలో ఉంటోంది. ఆమె కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌లో (Kamareddy RTC Bus Stand) స్వీపర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, వివాహేతర సంబంధానికి తన కొడుకు అడ్డుగా ఉన్నాడని లక్ష్మీనర్సింలుతో కలిసి ఆమె పన్నాగం పన్నింది. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు లక్ష్మీ వెళ్ళగానే సాయంత్రం సమయంలో శ్రావణ్(5)ను గొంతు పిసికి, నోరు-ముక్కు మూసి నేలకేసి కొట్టి కంట్లో కారం చల్లి దారుణంగా హత్య చేశాడు.
ఈ విషయమై రాజంపేటకు చెందిన లక్ష్మీ బాబాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ (Kamareddy City) సీఐ నరహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో వివాహేతర సంబంధమే శ్రావణ్ హత్యకు కారణమని తేలడంతో లక్ష్మీతో పాటు లక్ష్మీనర్సింలును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇది కూడా చదవండి: Armoor Police | మహిళ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నిందితుల అరెస్టు
