అక్షరటుడే, ఇందూరు: Kisan Nyay Satyagraha | యూఎస్ ట్రేడ్ డీల్‌తో (US trade deal issu) దేశ రైతులకు ప్రమాదం వాటిల్లుతుందని.. ఈ డీల్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్(Telangana Youth Congress) ఆధ్వర్యంలో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ (Kisan Nyay Satyagraha) మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి యూత్‌కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు.
Kisan Nyay Satyagraha | పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో..
ఈ సందర్భంగా జిల్లా నుంచి తరలి వెళ్లిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్ను పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (PCC Chief Bomma) జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్కు పరిచయం చేశారు.
జిల్లా నలుమూలల నుంచి బస్సుల్లో భారీ ఎత్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను మహాధర్నాలో భాగస్వామ్యం చేయించినందుకు విపుల్గౌడ్ను వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపల్ కిరణ్, ఆదిత్య పాటిల్, ఆకాష్ రెడ్డి, అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీల అధ్యక్షులు కార్తిక్ యాదవ్, మహీందర్, ప్రశాంత్, చరణ్ గౌడ్, మొయిన్, జిల్లా, అసెంబ్లీ, మండలాల కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి : Chaitanya Reddy Transfer | కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ.. సంగారెడ్డిలో పోస్టింగ్!
