అక్షరటుడే, వెబ్‌డెస్క్: Baswa Reddy Transfer | నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించారు.
2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుభం ప్రకాష్ గతంలో కరీంనగర్ రూరల్ ఏసీపీగా పనిచేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన్ను నిజామాబాద్‌కు బదిలీ చేశారు.
Baswa Reddy Transfer | బస్వారెడ్డి తనదైన ముద్ర..
నిజామాబాద్ అడిషనల్ డీసీపీగా సేవలు అందించిన బస్వారెడ్డి విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు. గతంలో ఆయన ఎస్సైగా, సీఐగా, ఏసీపీగా నిజామాబాద్ జిల్లాలో సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కమిషనరేట్‌పై పూర్తి పట్టు ఉంది.
కాగా, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బస్వారెడ్డి తాజా బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
